Navashakam News
  • HOME
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జిల్లా వార్తలు
  • విద్య
  • ఉద్యోగాలు
  • జాతీయం
  • క్రీడలు
  • సంప్రదించండి
  • _About Us
  • _Contact Us
  • _privacy policy
  • _Disclaimer
  • _Terms and conditions
  • _DMCA Notice
TEST

TEST

TEST

By - Navashakam News ఆగస్టు 22, 2026
Read Now
శీర్షిక లేదు

శీర్షిక లేదు

SBNEWS - Telugu News ‹ …

By - Navashakam News ఆగస్టు 21, 2026
Read Now
హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.     2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – హెచ్‌డబ్ల్యూపీఎం సీఎజీఎం. జి.శ్రీనివాస్.

హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – హెచ్‌డబ్ల్యూపీఎం సీఎజీఎం. జి.శ్రీనివాస్.

అశ్వాపురం: హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం ఆగస్టు 15, 2026
Read Now
మాంటిస్సోరి స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

మాంటిస్సోరి స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

మణుగూరు, ఆగస్టు 15: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మాంటిస్సోరి స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం ఆగస్టు 15, 2026
Read Now
యువత మహనీయుల బాటలో అడుగులు వేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.  సిఐ సిహెచ్. ఎల్లయ్య.

యువత మహనీయుల బాటలో అడుగులు వేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. సిఐ సిహెచ్. ఎల్లయ్య.

అశ్వాపురం, ఆగస్టు 15: యువత మహనీయుల బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అశ్వాపురం సీఐ సిహెచ్. ఎల్లయ్య పిలు…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం ఆగస్టు 15, 2026
Read Now
మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌కు సేవా పురస్కారం.

మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌కు సేవా పురస్కారం.

* మణుగూరు, ఆగస్టు 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల తహసీల్దార్‌గా అద్దంకి నరేష్ అందిస్తున్న అత్యుత్తమ సేవలకు…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం ఆగస్టు 15, 2026
Read Now
సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇక జాప్యం వద్దు.భూసేకరణ వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇక జాప్యం వద్దు.భూసేకరణ వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

నవశకం.అశ్వాపురం, ఆగస్టు 15: సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో ఇక ఎలాంటి జాప్యం చేయకుండా భూసేకరణను వేగవం…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం ఆగస్టు 15, 2026
Read Now
మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎంపీడీఓ ముత్యాలరావు ఆధ్వర్యంలో వేడుకలు. అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జి. ముత్యాలరావు ఆధ్వర్యంల…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం ఆగస్టు 15, 2026
Read Now
అశ్వాపురంలో స్కూల్, కాలేజీ వాహనాలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు.

అశ్వాపురంలో స్కూల్, కాలేజీ వాహనాలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ సిహెచ్ ఎల్లయ్య. అశ్వాపురం, జూలై 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్ల…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జులై 22, 2026
Read Now
మనుబోతుల గూడెం పోడు భూముల వివాదం.

మనుబోతుల గూడెం పోడు భూముల వివాదం.

* *అడవి సంరక్షణా..?*  *గిరిజనుల జీవన హక్కులా..?* *ఘటన వెనుక కుట్ర కోణమా..?*   *చట్టం ఏమి   చెబుతోంది.*? అశ్వాపురం .జూలై…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జులై 21, 2026
Read Now
చిరు వ్యాపారికి వ్యాపార గొడుగు అందించిన లయన్స్ క్లబ్.

చిరు వ్యాపారికి వ్యాపార గొడుగు అందించిన లయన్స్ క్లబ్.

రూ.1,500 విలువైన గొడుగును ఉచితంగా పంపిణీ చేసిన డాక్టర్ బి.వి.వి. సత్యనారాయణ నవశకం.అశ్వాపురం ప్రతినిధి. జూలై 21: అశ్వాపు…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జులై 21, 2026
Read Now
సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయాలకు చేరువ: ఎంపీడీవో ముత్యాలరావు

సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయాలకు చేరువ: ఎంపీడీవో ముత్యాలరావు

చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాలను సాధించాలని యువతకు సూచన. నవశకం.అశ్వాపురం ప్రతినిధి.జూలై 21: సోషల్ మీడియా వినియోగాన్ని త…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జులై 21, 2026
Read Now
మనుబోతులగూడెం ఘటన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు.

మనుబోతులగూడెం ఘటన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు.

మనుబోతులగూడెం ఘటనను పరిశీలించిన జిల్లా ఉన్నత అధికారులు. ఇరువైపులా వాదనలపై సమగ్ర సమాచారం.  అశ్వాపురం ప్రతినిధి. జూలై 20.…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జులై 21, 2026
Read Now
భద్రాద్రి లో మీటింగ్ ఏర్పాటు
pina

భద్రాద్రి లో మీటింగ్ ఏర్పాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మీటింగ్ కండెక్ట్ అయింది. ఈ సమావేశానికి పలువురు హాజరయ్యారు.

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జులై 08, 2026
Read Now
బిఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

బిఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

జూలై 02.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం మండలం, వెంకటాపురం గ్రామపంచాయతీ లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు …

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జులై 02, 2026
Read Now
 ఆదివాసీ కాలనీగా పేరు మార్చాలని గ్రామసభలో ఆదివాసీల వినతిపత్రం ..  అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలోని చింతకుంట ఆదివాసీలు తమ కాలనీ పేరును "ఆదివాసీ కాలనీ"గా మార్చాలని కోరుతూ గ్రామసభలో వినతిపత్రం సమర్పించారు. గ్రామ సర్పంచ్ మచ్చ నరసింహారావు, గ్రామ పెద్దలు, పాలకవర్గ సభ్యులు, ఎంపీడీవో ముత్యాలరావుకు ఆదివాసీలు ఈ వినతిపత్రాన్ని అందజేశారు.వినతిపత్రంలో వారు పేర్కొంటూ, గత పాలనలో తమ కాలనీకి తమ అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా "రేగ కాలనీ"గా నామకరణం చేసి బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ సమయంలో తమను గానీ, తమ అభిప్రాయాలను గానీ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఆదివాసీలందరికీ బాధ కలిగించిందని గ్రామసభ సభాముఖంగా వెల్లడించారు.చింతకుంట ఆదివాసీల అభిప్రాయం మేరకు తమ కాలనీకి ఏ నాయకుడి పేరు గానీ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు గానీ లేకుండా, తమ ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబించే విధంగా "ఆదివాసీ కాలనీ"గా నామకరణం చేయాలని కోరారు. గ్రామ ప్రజల సాక్షిగా గ్రామసభలో తీర్మానం చేసి, ప్రస్తుతం ఉన్న బోర్డు పేరును తొలగించి తక్షణమే "ఆదివాసీ కాలనీ"గా మార్చాలని సవినయంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాడిద మహేష్, ఆవుల రవి, బేతం రామకృష్ణ, తూము రాఘవులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జూన్ 06, 2026
Read Now
ఏఎల్ఎం సుబ్బారావుకు సర్పంచ్ భూరెడ్డి స్వాతి ఘన సన్మానం.

ఏఎల్ఎం సుబ్బారావుకు సర్పంచ్ భూరెడ్డి స్వాతి ఘన సన్మానం.

నవశకం. జూన్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో …

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జూన్ 06, 2026
Read Now
ఐటిడిఏ పి ఓ రాహుల్ ను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఐటిడిఏ పి ఓ రాహుల్ ను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

నవశకం.జూన్ 5:  వివరాలలోకి వెళ్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ కనబర్చి…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జూన్ 06, 2026
Read Now
తుమ్మల చెరువులో వన్యప్రాణులకు నీటి సౌకర్యం.

తుమ్మల చెరువులో వన్యప్రాణులకు నీటి సౌకర్యం.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం మండలం, తుమ్మల చెరువు బీట్ పరిధిలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ ఆధ్వర్య…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జూన్ 06, 2026
Read Now
భద్రాచలం ఐటిడిఏ పివో  రాహుల్ కు ఘన సత్కారం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

భద్రాచలం ఐటిడిఏ పివో రాహుల్ కు ఘన సత్కారం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

నవశకం.జూన్ 5:  వివరాలలోకి వెళ్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ కనబర్చి, కేంద్ర ప్ర…

By - నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం జూన్ 05, 2026
Read Now
మరిన్ని పోస్ట్‌లను లోడ్ చేయి ఫలితాలు కనుగొనబడలేదు

TEST

TEST
TEST
< Back to SBNEWS Reels

SBNEWS - Telugu News
SB NEWS

< Back to SBNEWS Reels

హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – హెచ్‌డబ్ల్యూపీఎం సీఎజీఎం. జి.శ్రీనివాస్.

హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.     2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – హెచ్‌డబ్ల్యూపీఎం సీఎజీఎం. జి.శ్రీనివాస్.

అశ్వాపురం: హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్‌డబ్ల్యూపీఎం చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జి. శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో హెచ్‌డబ్ల్యూపీఎం సాధించిన ప్రధాన విజయాలు, పురోగతిని వివరించారు. సంస్థ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు అందిస్తున్న సమిష్టి కృషిని అభినందించారు. ఇదే స్ఫూర్తి, అంకితభావంతో ముందుకు సాగుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

వేడుకల్లో సీఐఎస్ఎఫ్, ఫైర్ సర్వీసెస్, కాలనీ సెక్యూరిటీ, ఎన్‌సీసీ, పాఠశాల విద్యార్థుల ప్లాటూన్లు నిర్వహించిన ఆకట్టుకునే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన డాగ్ షో, రైఫిల్ విడదీయడం–తిరిగి అమర్చడం ప్రదర్శన, ఫైర్ సర్వీసెస్ నిర్వహించిన వాటర్ షో, రెస్క్యూ ఆపరేషన్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ కార్యక్రమం కూడా అలరించింది.

అనంతరం విద్యారంగంలో ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు ముఖ్య అతిథి జి. శ్రీనివాస్ బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

అంతకుముందు హెచ్‌డబ్ల్యూపీఎం ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీజీఎం జి. శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ ప్రగతి పట్ల నిబద్ధతను చాటుతూ అధికారులు, ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు, కాలనీ నివాసితుల సమిష్టి భాగస్వామ్యంతో వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో డీజీఎం (పి) ఓఝా, డీజీఎం (యు) రఫీక్ అహ్మద్, డీజీఎం (ఈఎస్) జగన్నాథ్, సీఏఓ లక్ష్మీ దేవి, ఏడీఎంఓ ఆశా జైసన్, ఏఓ-III (ఐఆర్) కృష్ణ కాంత్, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కోడ రాజు తదితర సీనియర్ అధికారులు, ఉద్యోగులు, కాలనీ నివాసితులు, ఏఈసీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.
< Back to SBNEWS Reels

మాంటిస్సోరి స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

మాంటిస్సోరి స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

మణుగూరు, ఆగస్టు 15: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మాంటిస్సోరి స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని పేర్కొన్న ఎమ్మెల్యే, విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యతో పాటు సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

దేశ సమగ్రత, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభను ఎమ్మెల్యే అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పినపాక నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభ్రాతృత్వాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాంటిస్సోరి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మండల, టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, మైనారిటీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
< Back to SBNEWS Reels

యువత మహనీయుల బాటలో అడుగులు వేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. సిఐ సిహెచ్. ఎల్లయ్య.

యువత మహనీయుల బాటలో అడుగులు వేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకం.  సిఐ సిహెచ్. ఎల్లయ్య.

అశ్వాపురం, ఆగస్టు 15: యువత మహనీయుల బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అశ్వాపురం సీఐ సిహెచ్. ఎల్లయ్య పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అశ్వాపురం పోలీస్ భవన్‌లో సీఐ సిహెచ్. ఎల్లయ్య మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

ఈ సందర్భంగా సీఐ ఎల్లయ్య మాట్లాడుతూ భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారు కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలే నేటి తరానికి స్ఫూర్తి కావాలని, ముఖ్యంగా యువత వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు.

అనంతరం మండల ప్రజలందరికీ సీఐ సిహెచ్. ఎల్లయ్య 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
< Back to SBNEWS Reels

మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌కు సేవా పురస్కారం.

మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌కు సేవా పురస్కారం.
*

మణుగూరు, ఆగస్టు 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల తహసీల్దార్‌గా అద్దంకి నరేష్ అందిస్తున్న అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పురస్కార పత్రం అందుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భద్రాచలం ఐఏఎస్ సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట చేతుల మీదుగా అద్దంకి నరేష్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభుత్వ అధికారిగా తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించడంలో ఆయన చూపుతున్న చొరవకు ఈ పురస్కారం నిదర్శనంగా నిలిచింది.

ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం, నిబద్ధతతో పనిచేస్తూ ‘సర్వీస్ ఎక్సలెన్స్’ సాధించినందుకు ఈ గౌరవం లభించింది.

ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు అద్దంకి నరేష్‌కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో మరింత అంకితభావంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
< Back to SBNEWS Reels

సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇక జాప్యం వద్దు.భూసేకరణ వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇక జాప్యం వద్దు.భూసేకరణ వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

నవశకం.అశ్వాపురం, ఆగస్టు 15: సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో ఇక ఎలాంటి జాప్యం చేయకుండా భూసేకరణను వేగవంతం చేసి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

శనివారం అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్‌, భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సంబంధించిన భూసేకరణ, పైప్‌లైన్‌, ఇతర నిర్మాణ పనుల పురోగతిని ఇరిగేషన్‌ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం పంపును ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు.

సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని, భూములు అప్పగించిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో భూసేకరణకు అవసరమైన నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

పైప్‌లైన్‌ ఏర్పాటు చేసిన భూముల్లో పనులు పూర్తయిన అనంతరం రైతులు భూమి పైభాగంలో తిరిగి వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది రైతుల కారణంగా పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టు పనులు నిలిచిపోకూడదని, రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టు పనులకు అందరూ సహకరించాలని కోరారు.

డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేసి సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు అదనంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు మూడు లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.

గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడే నీటిని ఎత్తిపోసుకునేలా చర్యలు చేపట్టాలని, పైప్‌లైన్‌ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే సమయంలో సీతారామ ప్రాజెక్టు నీరు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తుమ్మల చెరువు నిండడం ద్వారా సాగునీటితో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. బూర్గంపాడు మండలంలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.

అనంతరం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు. పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన భూసేకరణతో పాటు నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు తెలిపారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా రైతులు సహకరించాలని కోరారు.

వందల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు కొంతమంది రైతుల కారణంగా నిలిచిపోవడం సమంజసం కాదని మంత్రి అన్నారు. ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణను పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
< Back to SBNEWS Reels

మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎంపీడీఓ ముత్యాలరావు ఆధ్వర్యంలో వేడుకలు.

అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జి. ముత్యాలరావు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జి. ముత్యాలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు.

అనంతరం ఎంపీడీఓ ముత్యాలరావు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ పిచేశ్వరరావు, యూడీసీ జయరాజు, పంచాయతీరాజ్ ఏఈ, మిషన్ భగీరథ ఏఈలు, ఈజీఎస్ సిబ్బంది, వెలుగు కార్యాలయ సీసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, టీఏలు, అటెండర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
< Back to SBNEWS Reels

అశ్వాపురంలో స్కూల్, కాలేజీ వాహనాలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు.

అశ్వాపురంలో స్కూల్, కాలేజీ వాహనాలపై పోలీసుల ప్రత్యేక తనిఖీలు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీఐ సిహెచ్ ఎల్లయ్య.

అశ్వాపురం, జూలై 22:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో బుధవారం స్కూల్, కాలేజీలకు చెందిన వాహనాలపై అశ్వాపురం సీఐ సిహెచ్ ఎల్లయ్య ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనాల ఫిట్‌నెస్, బీమా, ఆర్‌సీ, పర్మిట్, పీయూసీ సర్టిఫికెట్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్పీడ్ గవర్నర్ తదితర భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. అలాగే డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్‌లు, అర్హతలను కూడా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా సీఐ సిహెచ్ ఎల్లయ్య మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వాహనాల్లో అధిక సంఖ్యలో విద్యార్థులను ఎక్కించరాదని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డ్రైవర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ తనిఖీల్లో ఏఎస్ఐ రామచంద్రారెడ్డితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
< Back to SBNEWS Reels

మనుబోతుల గూడెం పోడు భూముల వివాదం.

మనుబోతుల గూడెం పోడు భూముల వివాదం.
*
*అడవి సంరక్షణా..?*

 *గిరిజనుల జీవన హక్కులా..?*

*ఘటన వెనుక కుట్ర కోణమా..?*
 
*చట్టం ఏమి 
 చెబుతోంది.*?

అశ్వాపురం .జూలై 21. విజన్ ఆంధ్ర.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతులగూడెం గ్రామ పంచాయితీ పరిధిలోని, వేములూరు అటవీ ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది, ఆదివాసుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు పోడు భూములపై గిరిజనుల హక్కుల వాదన, మరోవైపు అడవుల సంరక్షణ బాధ్యతలతో అటవీశాఖ చర్యలు..
ఈ రెండు అంశాల మధ్య తలెత్తిన ఈ వివాదం ఇప్పుడు సామాజిక, రాజకీయ, న్యాయపరమైన చర్చలకు కేంద్రబిందువైంది.
ఈ సంఘటనలో అటవీ సిబ్బందితో పాటు, కొంతమంది మహిళా అటవీ సిబ్బంది కూడా గాయపడగా, ఒక గిరిజన మహిళ కూడా గాయపడి చికిత్స పొందుతోంది అనేది తెలిసిన విషయమే. ఇరువైపుల పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ , తమ వాదనలను, ఆవేదనను మీడియాకు , ప్రజలకు, అధికారులకు తెలియజేస్తున్నారు. ఇంతకు ఘటనకు అసలు కారణాలేమిటి? ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందా? లేక పరిస్థితులు అదుపుతప్పి ఘర్షణకు దారితీసాయా? అనే అంశాలపై అటవీశాఖ ఉన్నత అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు పరిశీలించటం జరిగింది. సంఘటనను నిశితంగా గమనించి , ఇరువైపులా వాదనను విని ఎవరిది తప్పు ?ఒప్పు? అనేది నిర్ధారించే పనిలో ఉన్నాము అని అధికారులు పేర్కొనడం జరిగింది.

*దాడి ముందస్తు ప్రణాళికలో భాగమేనా..?*

సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘర్షణ జరుగుతున్న సమయంలో కొందరు సెల్‌ఫోన్లతో వీడియోలు చిత్రీకరించడం, ఒకరి చేతిలో పెట్రోల్ బాటిల్ కనిపించిందనే ఆరోపణలు చర్చనీయాంశము అయ్యాయి.
తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ, "భూమి సమస్య పరిష్కారం కోసం వచ్చిన చోట పెట్రోల్ బాటిల్ ఎందుకు ఉంది? ఘర్షణను ఆపకుండా వీడియోలు ఎందుకు తీశారు? అమాయక మహిళలను ముందుకు నెట్టి దాడులు చేయించింది ఎవరు? దీని వెనుక కీలక పాత్రధారులు ఉన్నారా?" అనే కోణంలో కూడా సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి అధికారిక నిర్ధారణ ప్రకటించలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

*అటవీ శాఖ కీలక వాదన.*

అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రభుత్వం చేపట్టిన అటవీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆక్రమిత అటవీ భూములలో మొక్కల పెంపకం, ట్రెంచ్ తవ్వకం పనులు నిర్వహించేందుకు అటవీ సిబ్బంది వెళ్లిన సమయంలో , కొందరు వ్యక్తులు పనులను అడ్డుకుని యంత్రాన్ని నిలిపివేసి, మహిళా అటవీ ఉద్యోగులు, యంత్ర డ్రైవర్‌తో పాటు విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు.
అటవీశాఖ సిబ్బంది మాట్లాడుతూ "అడవులను రక్షించడం మా చట్టబద్ధమైన విధి. విధి నిర్వహణలో ఉన్న అధికారులపై దాడులు జరిగితే, భవిష్యత్తులో విధులు ఎలా నిర్వర్తించగలం? అడవిని కాపాడేది మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. తాము ఆక్రమించుకోని అటవీ సంపదను దోచుకోవడానికి కాదు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్టబద్ధంగా అప్పగించిన విధులను నిర్వర్తించడమే మా బాధ్యత. విధులు నిర్వహించడం పాపమా? చట్టరీత్యా నేరమా?" అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాయపడిన తమ సిబ్బందిని పరామర్శించకుండా, ఒకే కోణంలో తమపై దుష్ప్రచారం జరుగుతోందని వారు వాపోతున్నారు. "మా కుటుంబాలను వదిలి ప్రజల భవిష్యత్తు కోసం, అడవుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సిబ్బందిపై దాడులు జరగడం బాధాకరం. ప్రభుత్వ విధులను నిర్వర్తించే ఉద్యోగులకు రక్షణ లేకపోతే చట్ట అమలు ఎలా జరుగుతుంది?. కొంతమంది మీడియా ప్రతినిధులు, 
 రాజకీయ నాయకులు మరియు ప్రజలు కూడా రెండు వైపుల పరిస్థితిని గమనించి, న్యాయబద్ధంగా ఆరోపణలు చేయకుండా కేవలం గిరిజనుల వైపు, గొత్తి కోయల వైపు మాత్రమే మాట్లాడటం, విది నిర్వహణలో గాయపడిన తమ గిరిజన మహిళా సిబ్బంది పట్ల, ఇతర సిబ్బంది పట్ల సానుభూతిని చూపలేదు . కాని అన్యాయంగా పోడు భూములను ఆక్రమించుకొని, విధి నిర్వహణలో ఉన్న తమపై దాడికి దిగిన వారిని పరామర్శించడానికి వెళ్లారు. మాపై మాత్రం 
 ఇంత కాఠిన్యమా. మావి ప్రాణాలు కావా. విధి నిర్వహణలో మా ప్రాణాలు పోతే మా కుటుంబాల పరిస్థితి ఏమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు. 

*గిరిజనుల వాదన.*

మరోవైపు ఆదివాసులు మాత్రం తాము సాగు చేస్తున్న పోడు భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం, మహిళలపై బలప్రయోగం చేయడం వలననే ఉద్రిక్తత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.
కొన్ని సంవత్సరాలుగా తాము సాగుచేస్తున్న భూములపై హక్కులు ఇవ్వకుండా తమ జీవనాధారాన్ని దూరం చేయడం అన్యాయం. మా జీవితం, మా కుటుంబాల భవిష్యత్తు ఈ పోడు భూముల పైనే ఆధారపడి ఉంది" అని ఆదివాసీలు, గ్రామస్థులు చెబుతున్నారు.

*రాజకీయాలు – ఏకపక్ష వైఖరిపై విమర్శలు.*

సంఘటన అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు ఒకే వర్గం వాదనకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాయపడిన గిరిజనులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, విధి నిర్వహణలో గాయపడిన అటవీశాఖ సిబ్బందిని కూడా పరామర్శించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

*అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన.*

సోమవారం భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జిల్లా అటవీశాఖ అధికారి విక్రమ్ సింగ్, ఐటీడీఏ పీవో రాహుల్, ఎఫ్‌డీవో బాబు తదితర అధికారులు ఘటనాస్థలాన్ని సందర్శించారు. బాధితుల నుంచి , స్థానిక గ్రామ పెద్దల, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించి, పోడు భూముల సమస్య, అటవీ భూముల పరిరక్షణ, ఆదివాసుల జీవనాధారాలకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మంగళవారం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కూడా సంఘటన స్థలాన్ని సందర్శించటం జరిగింది. గిరిజనులను పరామర్శించి, ఘటనలో జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

*అటవీశాఖ స్పందన.*

సంఘటన తరువాత ఎఫ్‌డీవో బాబు మాట్లాడుతూ, "అటవీ సంపదను పరిరక్షించడం, అడవుల అభివృద్ధిని వేగవంతం చేయడమే మా ప్రధాన లక్ష్యం. ప్రజలపై దాడులు చేయడం మా ఉద్దేశం కాదు. ప్రజల సహకారంతోనే అడవులను కాపాడగలం. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు" అని విజ్ఞప్తి చేశారు.

*చట్టం ఏం చెబుతోంది?*,

ఈ ఘటనలో దర్యాప్తులో తేలే వాస్తవాల ఆధారంగా వివిధ చట్టాలు వర్తించే అవకాశం ఉంది.

*గిరిజనుల హక్కులు.*
- భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 – జీవించే హక్కు, గౌరవప్రదమైన జీవన హక్కు.
- భారత రాజ్యాంగం ఆర్టికల్ 46 – షెడ్యూల్డ్ తెగల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం పరిరక్షించాల్సిన బాధ్యత.
- అటవీ హక్కుల చట్టం–2006 ( ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ , 2006) – అర్హులైన గిరిజనులు, సంప్రదాయ అటవీ నివాసితుల వ్యక్తిగత, సామూహిక అటవీ హక్కులను గుర్తించే చట్టం.
- ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం–1989 – షెడ్యూల్డ్ తెగలపై కులం లేదా తెగ ఆధారంగా జరిగే దాడులు, అవమానాలు, హక్కుల ఉల్లంఘనలకు రక్షణ కల్పించే చట్టం.

.*అటవీశాఖ అధికారుల విధులు – హక్కులు.*
భారత అటవీ చట్టం–1927తో పాటు ఇతర అటవీ చట్టాల ప్రకారం అడవులను సంరక్షించడం, అక్రమ ఆక్రమణలను అరికట్టడం, ప్రభుత్వ అటవీ భూములను రక్షించడం అటవీశాఖ అధికారుల చట్టబద్ధమైన బాధ్యత. అదే సమయంలో విధి నిర్వహణలో మానవ హక్కులు, చట్టబద్ధ విధానాలను పాటించడం కూడా వారి బాధ్యతే.
భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) ప్రకారం
దర్యాప్తులో తేలే పరిస్థితులను బట్టి:

- సెక్షన్ 221 – ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణను అడ్డుకోవడం.
- సెక్షన్ 132 – విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి లేదా నేరపూరిత బలప్రయోగం.
- సెక్షన్ 115 – స్వచ్ఛందంగా గాయపరచడం.

అదే విధంగా దర్యాప్తులో గిరిజన మహిళపై చట్టవిరుద్ధంగా బలప్రయోగం, అవమానకర ప్రవర్తన జరిగినట్లు తేలితే ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం–1989లోని సంబంధిత నిబంధనలు కూడా వర్తించే అవకాశం ఉంది.

*పరిష్కారం ఎక్కడ?*

ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం కోసం నిపుణులు సూచిస్తున్న ప్రధాన అంశాలు:

-రెవెన్యూ– అటవీశాఖల సంయుక్త సర్వే.- అటవీ హక్కుల దరఖాస్తుల త్వరితగతిన పరిష్కారం.- గ్రామసభలతో ముందస్తు సంప్రదింపులు.- చట్టబద్ధ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించడం.- దాడులకు పాల్పడిన వారు ఎవరైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం.
చివరిగా మనుబోతులగూడెం ఘటనలో అసలు బాధ్యత ఎవరిదన్నది ఉన్నతాధికారుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుంది. అడవులను సంరక్షించడం ఎంత ముఖ్యమో, గిరిజనుల జీవన హక్కులను పరిరక్షించడం కూడా అంతే ముఖ్యమైనది. అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరం. మరోవైపు అధికారులు కూడా తమ చట్ట పరిమితులలో, మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. రాజకీయాలు, ప్రచారాలకు అతీతంగా వాస్తవాలను వెలికితీసి, చట్టబద్ధమైన పరిష్కారాన్ని కనుగొన్నప్పుడే మనుబోతుల గూడెం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు అని పర్యావరణ ప్రేమికులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
< Back to SBNEWS Reels

చిరు వ్యాపారికి వ్యాపార గొడుగు అందించిన లయన్స్ క్లబ్.

చిరు వ్యాపారికి వ్యాపార గొడుగు అందించిన లయన్స్ క్లబ్.

రూ.1,500 విలువైన గొడుగును ఉచితంగా పంపిణీ చేసిన డాక్టర్ బి.వి.వి. సత్యనారాయణ

నవశకం.అశ్వాపురం ప్రతినిధి. జూలై 21:
అశ్వాపురం మెయిన్ సెంటర్‌లో అరటిపండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న భూక్య రమేష్ దంపతులకు ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు లయన్స్ క్లబ్ అశ్వాపురం స్టార్స్ ఆధ్వర్యంలో రూ.1,500 విలువైన వ్యాపార గొడుగును ఉచితంగా పంపిణీ చేశారు.
లయన్స్ క్లబ్ అశ్వాపురం స్టార్స్ అధ్యక్షుడు డాక్టర్ బి.వి.వి. సత్యనారాయణ గొడుగును అందజేశారు. 

ఈ సందర్భంగా భూక్య రమేష్ మాట్లాడుతూ "లయన్స్ క్లబ్ అశ్వాపురం స్టార్స్ పేదలు, చిరు వ్యాపారులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొంటూ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ లయన్ గుర్రం నాగేశ్వరరావు, మణుగూరు జోన్ చైర్మన్ ఎం.జె.ఎఫ్. లయన్ నల్లగట్ల సత్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
< Back to SBNEWS Reels

సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయాలకు చేరువ: ఎంపీడీవో ముత్యాలరావు

సోషల్ మీడియాకు దూరంగా ఉంటేనే విజయాలకు చేరువ: ఎంపీడీవో ముత్యాలరావు

చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాలను సాధించాలని యువతకు సూచన.

నవశకం.అశ్వాపురం ప్రతినిధి.జూలై 21:
సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి చదువుపై పూర్తి దృష్టి సారిస్తేనే యువత తమ లక్ష్యాలను సులభంగా సాధించగలరని అశ్వాపురం ఎంపీడీవో ముత్యాలరావు అన్నారు.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఎక్కువ సమయం గడపడం వల్ల యువత చదువుపై ఏకాగ్రత కోల్పోయి, తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే వయస్సులో సమయాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తే ఉన్నత ర్యాంకులు, మంచి ఉద్యోగాలు సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి తగ్గుతోందని, ఇప్పటికైనా యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసి విద్యపై మక్కువ పెంచుకోవాలని సూచించారు.

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ చదివిస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. సమయాన్ని వృథా చేసే అలవాట్లకు దూరంగా ఉండి, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎంపీడీవో ముత్యాలరావు యువతకు పిలుపునిచ్చారు.
< Back to SBNEWS Reels

మనుబోతులగూడెం ఘటన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు.

మనుబోతులగూడెం ఘటన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు.
మనుబోతులగూడెం ఘటనను పరిశీలించిన జిల్లా ఉన్నత అధికారులు.

ఇరువైపులా వాదనలపై సమగ్ర సమాచారం.

 అశ్వాపురం ప్రతినిధి.
జూలై 20. (నవశకం). వివరాలలోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండల పరిధిలోని మనుబోతులగూడెం పోడు భూములకు సంబంధించి మూడు రోజుల క్రితం అటవీశాఖ అధికారులకు, వలస గొత్తి కోయ పోడు వ్యవసాయదారులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో సోమవారం జిల్లా ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు స్థానిక సర్పంచ్, గ్రామస్తులతో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోడు భూముల సమస్య, అటవీ భూముల పరిరక్షణ, ఆదివాసుల జీవనాధారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర సమాచారం సేకరించారు.
ఘటనకు దారితీసిన పరిస్థితులు, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, అన్ని అంశాలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిసింది. అశ్వాపురం మండలంలోని, మనుబోతులగూడెంలో పోడు భూముల సమస్య నేపథ్యంలో గురువారం అటవీశాఖ సిబ్బంది, ఆదివాసుల మధ్య చోటుచేసుకున్న ఘటనపై సోమవారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించారు. ఇరువర్గాల వాదనలు, గ్రామస్తుల అభిప్రాయాలు, పోడు భూముల పరిస్థితులు, అటవీ భూముల పరిరక్షణకు సంబంధించిన అంశాలను పరిశీలించి పూర్తి వివరాలను నమోదు చేసుకున్నారు.
ఘటనలో గిరిజన మహిళలకు గాయాలు అయినవారి పరిస్థితి ఎలా ఉందని జిల్లా ఉన్నతాధికారులు ప్రశ్నించగా, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు వైద్యశాలలో చేర్పించామని, వారి పరిస్థితి ప్రస్తుతం కొంచెం బాగానే ఉందని తెలియజేశారు. అనంతరం అటవీశాఖ మహిళా సిబ్బంది, ఇతర సిబ్బంది తమపై ఆదివాసీలు ఎలా దాడి చేసినది జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. ఆదివాసీలు కర్రలతో, వాటర్ బాటిళ్లతో దాడి చేసినది జిల్లా ఉన్నతాధికారులకు వివరించారు.
జిల్లాలో తీవ్ర సంచలనంగా మారిన, పెను సంఘటనకు దారితీసిన పరిస్థితులను అన్ని కోణాలలోనూ అధ్యయనం చేసి, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కాని పరస్పరం ఇలా దాడులకు దిగటం సరికాదని, సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అధికారులు తెలియజేశారు. పరిస్థితులను అన్నింటిని సమగ్రంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేయనున్నట్లు జిల్లా ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పిఓ రాహుల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ అధికారి (డిఎఫ్‌ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎస్ డి ఎఫ్ ఓ బాబు, మణుగూరు రేంజర్ ఉపేంద్ర, అశ్వాపురం రేంజర్ సత్తార్ అలీ, తహసీల్దార్ సూర్యప్రకాష్, సిఐ ఎల్లయ్య స్థానిక అటవీశాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

< Back to SBNEWS Reels

భద్రాద్రి లో మీటింగ్ ఏర్పాటు

భద్రాద్రి లో మీటింగ్ ఏర్పాటు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మీటింగ్ కండెక్ట్ అయింది. ఈ సమావేశానికి పలువురు హాజరయ్యారు.
< Back to SBNEWS Reels

బిఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

బిఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఘనంగా నివాళులు అర్పించిన జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

జూలై 02.
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం మండలం, వెంకటాపురం గ్రామపంచాయతీ లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు సోయం శ్రీను అనారోగ్యంతో మరణించిన విషయాన్ని తెలుసుకొని పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడ రేగాకాంతారావు శ్రీనివాస్ స్వగృహానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి, పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని, ఏ కష్టం ఎదురైనా నేరుగా నన్ను సంప్రదించాలని, పిల్లల చదువుల విషయంలో తాను దోహద పడతానని కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, సీనియర్ నాయకులు సూదిరెడ్డి గోపిరెడ్డి, మండల యువజన అధ్యక్షుడు గద్దల రామకృష్ణ, బొర్రా శ్రీను బాబు, పొడి మన్మథ రెడ్డి, యంగలి భిక్షంరెడ్డి, కళ్లం సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

< Back to SBNEWS Reels

ఆదివాసీ కాలనీగా పేరు మార్చాలని గ్రామసభలో ఆదివాసీల వినతిపత్రం .. అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలోని చింతకుంట ఆదివాసీలు తమ కాలనీ పేరును "ఆదివాసీ కాలనీ"గా మార్చాలని కోరుతూ గ్రామసభలో వినతిపత్రం సమర్పించారు. గ్రామ సర్పంచ్ మచ్చ నరసింహారావు, గ్రామ పెద్దలు, పాలకవర్గ సభ్యులు, ఎంపీడీవో ముత్యాలరావుకు ఆదివాసీలు ఈ వినతిపత్రాన్ని అందజేశారు.వినతిపత్రంలో వారు పేర్కొంటూ, గత పాలనలో తమ కాలనీకి తమ అభిప్రాయాలు సేకరించకుండా ఏకపక్షంగా "రేగ కాలనీ"గా నామకరణం చేసి బోర్డు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ సమయంలో తమను గానీ, తమ అభిప్రాయాలను గానీ పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల ఆదివాసీలందరికీ బాధ కలిగించిందని గ్రామసభ సభాముఖంగా వెల్లడించారు.చింతకుంట ఆదివాసీల అభిప్రాయం మేరకు తమ కాలనీకి ఏ నాయకుడి పేరు గానీ, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన పేరు గానీ లేకుండా, తమ ప్రత్యేక గుర్తింపును ప్రతిబింబించే విధంగా "ఆదివాసీ కాలనీ"గా నామకరణం చేయాలని కోరారు. గ్రామ ప్రజల సాక్షిగా గ్రామసభలో తీర్మానం చేసి, ప్రస్తుతం ఉన్న బోర్డు పేరును తొలగించి తక్షణమే "ఆదివాసీ కాలనీ"గా మార్చాలని సవినయంగా విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాడిద మహేష్, ఆవుల రవి, బేతం రామకృష్ణ, తూము రాఘవులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

< Back to SBNEWS Reels

ఏఎల్ఎం సుబ్బారావుకు సర్పంచ్ భూరెడ్డి స్వాతి ఘన సన్మానం.

ఏఎల్ఎం సుబ్బారావుకు సర్పంచ్ భూరెడ్డి స్వాతి ఘన సన్మానం.
నవశకం. జూన్ 6: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, రామచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలో విద్యుత్ శాఖలో సహాయ లైన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న సుబ్బారావుకు
తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసిన ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకోవడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామసభలో రామచంద్రపురం గ్రామపంచాయతీ సర్పంచ్ భూరెడ్డి స్వాతి సుబ్బారావును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. విద్యుత్ శాఖలో ప్రజలకు అందిస్తున్న సేవలు, విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.సుబ్బారావు సాధించిన ఈ గౌరవం రామచంద్రపురం గ్రామానికి గర్వకారణమని సర్పంచ్ భూరెడ్డి స్వాతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొని సుబ్బారావుకు అభినందనలు తెలియజేశారు.
< Back to SBNEWS Reels

ఐటిడిఏ పి ఓ రాహుల్ ను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఐటిడిఏ పి ఓ రాహుల్ ను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
నవశకం.జూన్ 5: 
వివరాలలోకి వెళ్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ కనబర్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ స్థాయి "ఉత్తమ ప్రాజెక్టు అధికారి" అవార్డును అందుకున్న భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డును స్వీకరించి భద్రాచలం చేరుకున్న తరువాత, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ను, ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి అభినందించారు. శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ "గిరిజనుల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం ఐటీడీఏ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లాకు గర్వకారణమన్నారు. గిరిజన సంస్కృతి పరిరక్షణ, ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, మహిళా సాధికారత, రైతులకు మార్కెటింగ్ అవకాశాల కల్పన, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు వంటి కార్యక్రమాల్లో రాహుల్ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పీవో రాహుల్ మాట్లాడుతూ " ఈ అవార్డు తన ఒక్కరి కృషికి మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గిరిజన ప్రజల సహకారానికి దక్కిన గుర్తింపు అని అన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
< Back to SBNEWS Reels

తుమ్మల చెరువులో వన్యప్రాణులకు నీటి సౌకర్యం.

తుమ్మల చెరువులో వన్యప్రాణులకు నీటి సౌకర్యం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వాపురం మండలం, తుమ్మల చెరువు బీట్ పరిధిలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల కోసం నీటి సౌకర్యం కల్పించారు. అడవిలోని పక్షులు, మూగజీవాల దాహార్తి తీర్చేందుకు బీట్ అధికారి రమేష్ మంగళవారం వివిధ ప్రాంతాల్లో నీటి పళ్లెలను ఏర్పాటు చేసి నీటిని నింపించారు.
వేసవిలో నీరు దొరకక వన్యప్రాణులు ఇబ్బందులు పడకుండా, అడవిలోనే రక్షణ కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు బీట్ అధికారి రమేష్ తెలియజేశారు
. ఎండలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో వన్యప్రాణుల కోసం ఇలాంటి చర్యలు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
< Back to SBNEWS Reels

భద్రాచలం ఐటిడిఏ పివో రాహుల్ కు ఘన సత్కారం చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

నవశకం.జూన్ 5: 
వివరాలలోకి వెళ్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేష ప్రతిభ కనబర్చి, కేంద్ర ప్రభుత్వం నుంచి జాతీయ స్థాయి "ఉత్తమ ప్రాజెక్టు అధికారి" అవార్డును అందుకున్న భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు.ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డును స్వీకరించి భద్రాచలం చేరుకున్న తరువాత, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ను, ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే కలిసి అభినందించారు. శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ "గిరిజనుల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం ఐటీడీఏ చేపట్టిన వినూత్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లాకు గర్వకారణమన్నారు. గిరిజన సంస్కృతి పరిరక్షణ, ఆశ్రమ పాఠశాలల అభివృద్ధి, మహిళా సాధికారత, రైతులకు మార్కెటింగ్ అవకాశాల కల్పన, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు వంటి కార్యక్రమాల్లో రాహుల్ చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.
పీవో రాహుల్ మాట్లాడుతూ " ఈ అవార్డు తన ఒక్కరి కృషికి మాత్రమే కాకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గిరిజన ప్రజల సహకారానికి దక్కిన గుర్తింపు అని అన్నారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
< Back to SBNEWS Reels

FOLLOWERS

Popular Posts

తుమ్మల చెరువులో వన్యప్రాణులకు నీటి సౌకర్యం.
Navashakam. 12.May. 2026

తుమ్మల చెరువులో వన్యప్రాణులకు నీటి సౌకర్యం.

By -నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం మే 11, 2026
తుమ్మల చెరువులో నీటి సౌకర్యం
నవశకం.

తుమ్మల చెరువులో నీటి సౌకర్యం

మే 12, 2026
అశ్వాపురం ఎస్సీ కాలనీలో భారీ చోరి.
నవశకం.అశ్వాపురం ప్రతినిధి

అశ్వాపురం ఎస్సీ కాలనీలో భారీ చోరి.

మే 11, 2026
సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇక జాప్యం వద్దు.భూసేకరణ వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇక జాప్యం వద్దు.భూసేకరణ వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

ఆగస్టు 15, 2026

Social Plugin

  • YouTube
  • Instagram
  • Facebook

కంటెంట్ దాతలు

నా ఫోటో
Navashakam News
నా ఫోటో
నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం

Follow The Blog

Navashakam News

SBNEWS

; - navashakam at navashakam news | Distributed by SBNEWS
  • Home
  • About
  • Contact us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms and Conditions
  • DMCA Notice