అశ్వాపురం, ఆగస్టు 15: యువత మహనీయుల బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అశ్వాపురం సీఐ సిహెచ్. ఎల్లయ్య పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అశ్వాపురం పోలీస్ భవన్‌లో సీఐ సిహెచ్. ఎల్లయ్య మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా సీఐ ఎల్లయ్య మాట్లాడుతూ భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారు కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలే నేటి తరానికి స్ఫూర్తి కావాలని, ముఖ్యంగా యువత వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు.