ఎంపీడీఓ ముత్యాలరావు ఆధ్వర్యంలో వేడుకలు.
అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జి. ముత్యాలరావు ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జి. ముత్యాలరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జెండాకు వందనం చేశారు.
అనంతరం ఎంపీడీఓ ముత్యాలరావు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలు, పోరాటాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ పిచేశ్వరరావు, యూడీసీ జయరాజు, పంచాయతీరాజ్ ఏఈ, మిషన్ భగీరథ ఏఈలు, ఈజీఎస్ సిబ్బంది, వెలుగు కార్యాలయ సీసీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, టీఏలు, అటెండర్లు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.