చదువుపై దృష్టి పెట్టి లక్ష్యాలను సాధించాలని యువతకు సూచన.
నవశకం.అశ్వాపురం ప్రతినిధి.జూలై 21:
సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి చదువుపై పూర్తి దృష్టి సారిస్తేనే యువత తమ లక్ష్యాలను సులభంగా సాధించగలరని అశ్వాపురం ఎంపీడీవో ముత్యాలరావు అన్నారు.
ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికలపై ఎక్కువ సమయం గడపడం వల్ల యువత చదువుపై ఏకాగ్రత కోల్పోయి, తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చదువుకునే వయస్సులో సమయాన్ని సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తే ఉన్నత ర్యాంకులు, మంచి ఉద్యోగాలు సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సోషల్ మీడియా ప్రభావంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి తగ్గుతోందని, ఇప్పటికైనా యువత తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని సోషల్ మీడియా వినియోగాన్ని పరిమితం చేసి విద్యపై మక్కువ పెంచుకోవాలని సూచించారు.
ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో కష్టాలు పడుతూ చదివిస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. సమయాన్ని వృథా చేసే అలవాట్లకు దూరంగా ఉండి, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎంపీడీవో ముత్యాలరావు యువతకు పిలుపునిచ్చారు.