హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – హెచ్‌డబ్ల్యూపీఎం సీఎజీఎం. జి.శ్రీనివాస్.

నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
By -
0


అశ్వాపురం: హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్‌డబ్ల్యూపీఎం చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జి. శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో హెచ్‌డబ్ల్యూపీఎం సాధించిన ప్రధాన విజయాలు, పురోగతిని వివరించారు. సంస్థ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు అందిస్తున్న సమిష్టి కృషిని అభినందించారు. ఇదే స్ఫూర్తి, అంకితభావంతో ముందుకు సాగుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.

వేడుకల్లో సీఐఎస్ఎఫ్, ఫైర్ సర్వీసెస్, కాలనీ సెక్యూరిటీ, ఎన్‌సీసీ, పాఠశాల విద్యార్థుల ప్లాటూన్లు నిర్వహించిన ఆకట్టుకునే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన డాగ్ షో, రైఫిల్ విడదీయడం–తిరిగి అమర్చడం ప్రదర్శన, ఫైర్ సర్వీసెస్ నిర్వహించిన వాటర్ షో, రెస్క్యూ ఆపరేషన్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ కార్యక్రమం కూడా అలరించింది.

అనంతరం విద్యారంగంలో ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు ముఖ్య అతిథి జి. శ్రీనివాస్ బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

అంతకుముందు హెచ్‌డబ్ల్యూపీఎం ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీజీఎం జి. శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ ప్రగతి పట్ల నిబద్ధతను చాటుతూ అధికారులు, ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు, కాలనీ నివాసితుల సమిష్టి భాగస్వామ్యంతో వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో డీజీఎం (పి) ఓఝా, డీజీఎం (యు) రఫీక్ అహ్మద్, డీజీఎం (ఈఎస్) జగన్నాథ్, సీఏఓ లక్ష్మీ దేవి, ఏడీఎంఓ ఆశా జైసన్, ఏఓ-III (ఐఆర్) కృష్ణ కాంత్, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ కోడ రాజు తదితర సీనియర్ అధికారులు, ఉద్యోగులు, కాలనీ నివాసితులు, ఏఈసీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default