తుమ్మల చెరువులో వన్యప్రాణులకు నీటి సౌకర్యం.

నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
By -
0
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, తుమ్మల చెరువు బీట్ పరిధిలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల కోసం ప్రత్యేక నీటి సౌకర్యాలు కల్పించారు. అడవిలోని పక్షులు, మూగజీవాల దాహార్తి తీర్చేందుకు బీట్ అధికారి రమేష్ మంగళవారం వివిధ ప్రాంతాల్లో నీటి పళ్లెలను ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపించారు.వేసవి కాలంలో నీటి కొరత కారణంగా వన్యప్రాణులు ఇబ్బందులు పడకుండా, అడవిలోనే వాటికి రక్షణ కల్పించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు బీట్ అధికారి రమేష్ తెలిపారు. ఎండలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో వన్యప్రాణుల కోసం ఇలాంటి చర్యలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
3/related/default