మరింత చదవండి
ఎక్కువ చూపు
హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – హెచ్‌డబ్ల్యూపీఎం సీఎజీఎం. జి.శ్రీనివాస్.
అశ్వాపురం: హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్…
By -
నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
ఆగస్టు 15, 2026
Read Now
మాంటిస్సోరి స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మణుగూరు, ఆగస్టు 15: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మాంటిస్సోరి స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక…
By -
నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
ఆగస్టు 15, 2026
Read Now
యువత మహనీయుల బాటలో అడుగులు వేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. సిఐ సిహెచ్. ఎల్లయ్య.
అశ్వాపురం, ఆగస్టు 15: యువత మహనీయుల బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అశ్వాపురం సీఐ సిహెచ్. ఎల్లయ్య పిలు…
By -
నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
ఆగస్టు 15, 2026
Read Now
మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌కు సేవా పురస్కారం.
* మణుగూరు, ఆగస్టు 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల తహసీల్దార్‌గా అద్దంకి నరేష్ అందిస్తున్న అత్యుత్తమ సేవలకు…
By -
నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
ఆగస్టు 15, 2026
Read Now
సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇక జాప్యం వద్దు.భూసేకరణ వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
నవశకం.అశ్వాపురం, ఆగస్టు 15: సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో ఇక ఎలాంటి జాప్యం చేయకుండా భూసేకరణను వేగవం…
By -
నవశకం ప్రతినిధి వెంకట్ రెడ్డి అశ్వాపురం
ఆగస్టు 15, 2026
Read Now
TEST
< Back to SBNEWS Reels
SB
NEWS
హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – హెచ్‌డబ్ల్యూపీఎం సీఎజీఎం. జి.శ్రీనివాస్.
అశ్వాపురం: హెచ్‌డబ్ల్యూపీఎం కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెచ్‌డబ్ల్యూపీఎం చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) జి. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జి. శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది కాలంలో హెచ్‌డబ్ల్యూపీఎం సాధించిన ప్రధాన విజయాలు, పురోగతిని వివరించారు. సంస్థ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు అందిస్తున్న సమిష్టి కృషిని అభినందించారు. ఇదే స్ఫూర్తి, అంకితభావంతో ముందుకు సాగుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
వేడుకల్లో సీఐఎస్ఎఫ్, ఫైర్ సర్వీసెస్, కాలనీ సెక్యూరిటీ, ఎన్‌సీసీ, పాఠశాల విద్యార్థుల ప్లాటూన్లు నిర్వహించిన ఆకట్టుకునే పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రదర్శించిన డాగ్ షో, రైఫిల్ విడదీయడం–తిరిగి అమర్చడం ప్రదర్శన, ఫైర్ సర్వీసెస్ నిర్వహించిన వాటర్ షో, రెస్క్యూ ఆపరేషన్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థుల ఫ్యాన్సీ డ్రెస్ కార్యక్రమం కూడా అలరించింది.
అనంతరం విద్యారంగంలో ప్రతిభ కనబరిచిన మెరిట్ విద్యార్థులకు ముఖ్య అతిథి జి. శ్రీనివాస్ బహుమతులు అందజేసి అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులోనూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
అంతకుముందు హెచ్‌డబ్ల్యూపీఎం ప్లాంట్ ప్రాంగణంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీజీఎం జి. శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తి, ఐక్యత, క్రమశిక్షణ, జాతీయ ప్రగతి పట్ల నిబద్ధతను చాటుతూ అధికారులు, ఉద్యోగులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, విద్యార్థులు, కాలనీ నివాసితుల సమిష్టి భాగస్వామ్యంతో వేడుకలు ఉత్సాహంగా ముగిశాయి.
మాంటిస్సోరి స్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.విద్యార్థులు దేశభక్తి, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాల వైపు సాగాలి – ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మణుగూరు, ఆగస్టు 15: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని మాంటిస్సోరి స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం దేశభక్తి, జాతీయ స్ఫూర్తితో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకుంటూ వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని పేర్కొన్న ఎమ్మెల్యే, విద్యార్థులు చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యతో పాటు సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు చూపిన ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
దేశ సమగ్రత, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతూ ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ప్రతిభను ఎమ్మెల్యే అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మంచి విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను నేర్పించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పినపాక నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభ్రాతృత్వాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాంటిస్సోరి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, మండల, టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, మైనారిటీ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
యువత మహనీయుల బాటలో అడుగులు వేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. సిఐ సిహెచ్. ఎల్లయ్య.
అశ్వాపురం, ఆగస్టు 15: యువత మహనీయుల బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అశ్వాపురం సీఐ సిహెచ్. ఎల్లయ్య పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అశ్వాపురం పోలీస్ భవన్‌లో సీఐ సిహెచ్. ఎల్లయ్య మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా సీఐ ఎల్లయ్య మాట్లాడుతూ భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారు కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సమాజ నిర్మాణం కోసం ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల ఆశయాలే నేటి తరానికి స్ఫూర్తి కావాలని, ముఖ్యంగా యువత వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. దేశ సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని అన్నారు.
మణుగూరు తహసీల్దార్ అద్దంకి నరేష్‌కు సేవా పురస్కారం.
*
< Back to SBNEWS Reels
మణుగూరు, ఆగస్టు 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల తహసీల్దార్‌గా అద్దంకి నరేష్ అందిస్తున్న అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా సేవా పురస్కార పత్రం అందుకోవడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని భద్రాచలం ఐఏఎస్ సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట చేతుల మీదుగా అద్దంకి నరేష్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభుత్వ అధికారిగా తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా పరిష్కరించడంలో ఆయన చూపుతున్న చొరవకు ఈ పురస్కారం నిదర్శనంగా నిలిచింది.
ప్రజలకు అందుబాటులో ఉంటూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పారదర్శకత, వేగం, నిబద్ధతతో పనిచేస్తూ ‘సర్వీస్ ఎక్సలెన్స్’ సాధించినందుకు ఈ గౌరవం లభించింది.
సీతారామ ప్రాజెక్టు పనుల్లో ఇక జాప్యం వద్దు.భూసేకరణ వేగవంతం చేసి డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు పూర్తి చేయాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
నవశకం.అశ్వాపురం, ఆగస్టు 15: సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కాలువల పనుల్లో ఇక ఎలాంటి జాప్యం చేయకుండా భూసేకరణను వేగవంతం చేసి పనులను పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరులోగా సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
శనివారం అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద సీతారామ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్‌కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటరీ కాలువలకు సంబంధించిన భూసేకరణ, పైప్‌లైన్, ఇతర నిర్మాణ పనుల పురోగతిని ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం పంపును ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు.
సీతారామ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని, భూములు అప్పగించిన వెంటనే రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో భూసేకరణకు అవసరమైన నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
పైప్‌లైన్ ఏర్పాటు చేసిన భూముల్లో పనులు పూర్తయిన అనంతరం రైతులు భూమి పైభాగంలో తిరిగి వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది రైతుల కారణంగా పెద్ద సంఖ్యలో రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టు పనులు నిలిచిపోకూడదని, రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టు పనులకు అందరూ సహకరించాలని కోరారు.
డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు అదనంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా సుమారు మూడు లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.
గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడే నీటిని ఎత్తిపోసుకునేలా చర్యలు చేపట్టాలని, పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే సమయంలో సీతారామ ప్రాజెక్టు నీరు రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తుమ్మల చెరువు నిండడం ద్వారా సాగునీటితో పాటు పర్యాటక అభివృద్ధికి కూడా అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. బూర్గంపాడు మండలంలో సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు.
అనంతరం మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు. పనులు ఇంకా పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన భూసేకరణతో పాటు నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులకు తెలిపారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తయ్యేలా రైతులు సహకరించాలని కోరారు.
వందల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పనులు కొంతమంది రైతుల కారణంగా నిలిచిపోవడం సమంజసం కాదని మంత్రి అన్నారు. ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతులకు నష్టం కలగకుండా నష్టపరిహారం చెల్లిస్తూ భూసేకరణను పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.