రూ.1,500 విలువైన గొడుగును ఉచితంగా పంపిణీ చేసిన డాక్టర్ బి.వి.వి. సత్యనారాయణ
నవశకం.అశ్వాపురం ప్రతినిధి. జూలై 21:
అశ్వాపురం మెయిన్ సెంటర్‌లో అరటిపండ్ల వ్యాపారం నిర్వహిస్తున్న భూక్య రమేష్ దంపతులకు ఎండ, వర్షాల నుంచి రక్షణ కల్పించేందుకు లయన్స్ క్లబ్ అశ్వాపురం స్టార్స్ ఆధ్వర్యంలో రూ.1,500 విలువైన వ్యాపార గొడుగును ఉచితంగా పంపిణీ చేశారు.
లయన్స్ క్లబ్ అశ్వాపురం స్టార్స్ అధ్యక్షుడు డాక్టర్ బి.వి.వి. సత్యనారాయణ గొడుగును అందజేశారు.
ఈ సందర్భంగా భూక్య రమేష్ మాట్లాడుతూ "లయన్స్ క్లబ్ అశ్వాపురం స్టార్స్ పేదలు, చిరు వ్యాపారులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొంటూ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.