పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారి జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా రేషన్ డీలర్ల సంఘం నాయకులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు కొడాలి వెంకటేశ్వరరావు మరియు ఇతర రేషన్ డీలర్లు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు దీర్ఘాయుష్షు, ఆరోగ్య సంపద కలగాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన మరింత ముందుండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో పలువురు రేషన్ డీలర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.